
*E-Waste అంటే ఏమిటి?* పనిచేయని, పాతబడిన, ఉపయోగించలేని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులను E-Waste అంటారు. *E-Waste లో వచ్చే వస్తువులు:* *1. ఇంట్లో వాడేవి:* - పాత మొబైల్ ఫోన్లు, చార్జర్లు, హెడ్ ఫోన్లు - ల్యాప్ టాప్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్ - టీవీ, రిమోట్, బ్యాటరీలు, ట్యూబ్ లైట్లు *2. పాఠశాలలో వచ్చేవి:* - పాడైన కంప్యూటర్ పార్ట్స్, UPS బ్యాటరీలు, ప్రొజెక్టర్ బల్బులు, వైర్లు *E-Waste వల్ల నష్టాలు:* - బ్యాటరీలో ఉండే సీసం, పాదరసం భూమిలోకి వెళ్లి నీరు, పంటలు కలుషితం అవుతాయి. - కాల్చితే విషవాయువులు వచ్చి ఆరోగ్యానికి హాని. - పిల్లలకు చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు వస్తాయి. *మనం ఏం చేయాలి? (బాధ్యతాయుత పారవేయడం)* *1. వేరు చేయడం:* E-Waste ని ఎప్పుడూ ఇతర చెత్తతో కలపకూడదు. ప్రత్యేకంగా ఎర్ర బిన్ (E-WASTE) లోనే వేయాలి. *2. Reduce:* అవసరం లేకపోతే కొత్త గాడ్జెట్ కొనవద్దు. *3. Reuse:* పనిచేసే పాత ఫోన్ ను ఇతరులకు ఇవ్వవచ్చు. *4. Recycle:* పంచాయతీ / మున్సిపాలిటీ వారికి లేదా అధీకృత రీసైక్లింగ్ సెంటర్ కి ఇవ్వాలి.

