Chandra sekhar
Chandra sekharVerified
1mo agoAkkayyapalem, Visakhapatnam, Andhra Pradesh

పుల్లారెడ్డి రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా NSPC–2026 పోస్టర్ ఆవిష్కరణ భూమాత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ప్రతి పౌరుడు NSPC–2026 పరీక్షలో పాల్గొనాలి కర్నూలు: జెన్‌జెడ్ కర్నూలు ఆధ్వర్యంలో పుల్లారెడ్డి రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన యువజన సదస్సులో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్ (NSPC–2026) పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. పి.వి. మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు సంధిరెడ్డి శ్రీనివాస్ గారు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగోతు హరికృష్ణ గారు, పర్యావరణ సంరక్షణ గతి విధి యువ శక్తి ప్రముఖ్ (ఆంధ్రప్రదేశ్) శివాజీ పాలేటి గారు, డాక్టర్ మహేంద్ర గారు పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, నీటి కొరత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య నష్టం వంటి తీవ్రమైన పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రకృతిని కాపాడడం అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. NSPC–2026 పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన జాతీయ స్థాయి ఆన్‌లైన్ పరీక్ష అని తెలిపారు. ఈ పరీక్షను కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ రాయాలని పిలుపునిచ్చారు. ఈ పరీక్ష ద్వారా పర్యావరణ పరిరక్షణపై మనకు ఎంత అవగాహన ఉందో స్వీయ మూల్యాంకనం చేసుకునే అవకాశం లభిస్తుందని, భూమాత సంరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను గుర్తించి ఆచరణలో పెట్టేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే, NSPC–2026 పరీక్షలో పాల్గొన్న వారికి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) మరియు పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (Ministry of Environment, Forest and Climate Change) సహకారంతో జారీ చేయబడే డిజిటల్ సర్టిఫికేట్ అందజేయబడుతుందని తెలిపారు. ఈ సర్టిఫికేట్ పర్యావరణ పరిరక్షణ పట్ల వ్యక్తి నిబద్ధతను ప్రతిబింబించే గుర్తింపుగా నిలుస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు, పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. “భూమాత సంరక్షణ మనందరి బాధ్యత. NSPC–2026 ద్వారా పర్యావరణంపై మన అవగాహనను స్వయంగా అంచనా వేసుకొని, హరిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

3 comments

No comments yet